నాగం గారు రచించిన మాజీ విద్యార్ధి ఏకాపాత్రాభినయం ఇది. ఈ రచన యొక్క ముద్రణాకాలం 1982.
http://www.youtube.com/watch?v=qCzHABQIa6w
మా నాన్న గారు
Sunday, December 26, 2010
Saturday, December 18, 2010
ఈ శరత్తు కాపీల్రాయుడు!
ఇది కూడా మా నాన్న నాగం గారి రచనే. ఇది వ్రాయడం ద్వారా అప్పట్లో నా భవిశ్యత్తుని ఊహించారేమో, నిర్దేశించారేమో అనిపిస్తోంది. ఎందుకంటే పలు కారణాల వల్ల ఇంటర్ రెండవ (చివరి) ఏడాది సరిగ్గా చదవక దాదాపుగా ఈ ఏకపాత్రాభినయంలో చెప్పినట్లుగానే చిట్టీలు వ్రాస్తూ పట్టుబడి ఆరు నెలలు డిబార్ అయ్యాను. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డ్ అందుకున్న మా నాన్న గారికి ఇంటరులో డిబార్ అయిన కొడుకును నేను. అందుకే అంటారేమో - పండిత పుత్రా పరమ శుంఠా అనీ!
http://www.youtube.com/watch?v=LNaKlQcN_ME
http://www.youtube.com/watch?v=LNaKlQcN_ME
Friday, December 3, 2010
నాగం రచనల్లో బాగా ఆదరణ పొందిన రచన, ప్రదర్శన - గొర్ల కాపరి సుద్దులు
నాగం గారి రచనల్లో బాగా ఆదరణ పొందిన, ప్రదర్శింపబడిన రచన ఇది. ప్రేక్షకుల మధ్యనే గొర్ల కాపర్ల పాత్రలు కూర్చొని ఒక్కొక్కరూ బయటకు వచ్చి స్టేజి ఎక్కడం చూస్తున్నవారికి చాలా సరదాగా వుంటుండేది. అప్పట్లో మా ప్రాంతంలో విశేషంగా ఆదరణ పొందిన ఈ ఏకాంకికను నేనూ నా చిన్నతనంలో చాలాసార్లు చూసి సరదాపడ్డాను.
http://www.youtube.com/watch?v=CxZYxuSKP1s
http://www.youtube.com/watch?v=CxZYxuSKP1s
Thursday, December 2, 2010
కలికాల తత్వాలు
నాగం గారు రచించిన సరసవినోదిని పుస్తకంలోని మరియొక బృందగీతం కలికాల తత్వాలు. ప్రస్తుతకాలంలో నడుస్తున్న ద్వంద్వనీతిని ఇందులో నాన్నగారు ఎద్దేవా చేసారు. ముద్రణాకాలం జనవరి 1982.
http://www.youtube.com/watch?v=eG8pxbtdUsQ
http://www.youtube.com/watch?v=eG8pxbtdUsQ
Tuesday, November 30, 2010
జైలుకెళ్ళిన మా నాన్న నాగం గారు
పూలమొక్కలకు బదులుగా కూరగాయమొక్కలు అనే ఉద్యమంలో భాగంగా కొందరు నాస్తిక కార్యకర్తలు జైలుకి వెళ్ళారు. అలా జైలులో నెలరోజులు వున్నవారిలో మా నాన్న నాగం గారు మరియు నా సోదరులు జీవన్ వున్నారు.
http://www.youtube.com/watch?v=qs_5Sp603gM
http://www.youtube.com/watch?v=qs_5Sp603gM
Sunday, November 28, 2010
గ్రామగ్రామాన నాస్తికోద్యమం
తెలంగాణాలోని పల్లెల్లో జరిగిన నాస్తికోద్యమం మరియు మార్పు వివాహాల గురించి శ్రీ నాగం గారు తెలియపరిచారు.
http://www.youtube.com/watch?v=0uUtvNVoz5U
http://www.youtube.com/watch?v=0uUtvNVoz5U
Subscribe to:
Posts (Atom)